మూడున్నర ఏళ్లకు దొరగారికి ఎన్నికల ప్రణాళిక గుర్తుకు వచ్చిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ప్రెస్ మీట్ లో జీవన్ రెడ్డి పలు కామెంట్లు చేశారు. అన్నా చెల్లెళ్ళ అనురాగానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి సందర్బంగా జీవన్ రెడ్డి ఆడబిడ్డలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ హామీపై జీవన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. 57 ఏళ్ల ఆసరా పెన్షన్ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న ఆయన... ఇప్పటికైనా 44 నెలలకు ఆ అంశం గుర్తుకు వచ్చిందుకు సంతోషిస్తున్నానన్నారు. ఈ విషయంలో సీఎంను అభినందిస్తున్నానని చెప్పారు. 57ఏళ్ల వయసు ప్రామాణికం ఎపిక్ కార్డు అంటున్నారు ఇదెక్కడి న్యాయం అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఓల్డ్ ఏజ్ పెన్షన్ 58 ఏళ్లకే అని ప్రకటిస్తే కేటీఆర్ ఎద్దేవా చేశాడు... కానీ ఎన్నికల సమయం సమీపించడంతో 57ఏళ్లకు కుదించారన్నారు. పేదరికం కంటే దిగువన( కుటుంబం ప్రాయోజిత భీమా ) ఉన్న కుటుంబాలకు భీమా సౌకర్యం కల్పించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఉత్సవాలు ఆర్భాటం కోసం కాదు...
అధికారమే లక్ష్యంగా, మతతత్వం, విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని జీవన్ రెడ్డి అన్నారు. ఆ తర్వాత దేశ ఆర్థిక పరిస్థితిపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. నిత్యావసర సరుకుల భారం ప్రజానికంపై పడుతుందన్న ఆయన... 60 లక్షల కోట్లు ఉన్న అప్పుల భారం, ప్రస్తుతం రూ.130 లక్షల కోట్ల అప్పులకు పెరిగిందని విమర్శించారు. ఏటా రూ.10 లక్షల కోట్ల అప్పుల భారం పెరుగుతుందని.. దీని వల్ల పబ్లిక్ సెక్టార్ నిర్వర్యం అయ్యి ప్రయివేట్ పరమయ్యే పరిస్థితి ఉందని చెప్పుకొచ్చారు.
ప్రగతిని నిర్వర్యం చేసేందుకు ప్రయత్నాలు...
దేశం తిరోగమనం వైపు అడుగులు వేస్తుందని... అగ్ని పథ్ లాంటి కార్యక్రమం నిర్వహిస్తూ యువత ఆశలను నిర్వీర్యం చేస్తుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రం స్థాయిలో కూడా 1956 ఉమ్మడి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 2014 వరకు 58 ఏళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణ అప్పుల వాటా 60 వేల కోట్లు ఉంటే, నాలుగు లక్షల కోట్లకు చేరిందన్నారు. ఏటా50 వేల కోట్లు అప్పుల వాటా తేలిందని చెప్పారు. 2014 వరకు ఆస్తుల పరిరక్షణ, ఉద్యోగం భద్రతా లక్ష్యంగా ఆనాటి ప్రభుత్వాలు పని చేశాయన్న ఆయన.... నేడు రెండు ప్రభుత్వాలూ దేశం, రాష్ట్రం ప్రగతిని నిర్వర్యం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. నూతన వనరుల సమీకరణకు ఆస్తుల అమ్మకంతో ఆదాయం పొందే విధంగా ఒక అంశంగా చర్చించడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందన్నారు. ఉత్సవాలు ఆర్భాటం కోసం కాదు... వాస్తవం దృక్పథంతో నిర్మాణాత్మంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పారు. ప్రాధాన్యత కల్పించే విధంగా కార్యక్రమం అమలు తీరు ఉండాలన్నారు.
దళితుల సంక్షేమానికి వేచ్చించలేకే..
నిరుపేద కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో చనిపోతే నేషనల్ ఫ్యామిలీ బెనిఫిషరీ ఫండ్ కింద రూ.20 వేలు కల్పించబడేవని... నేడు ఈ కార్యక్రమాన్నీ నిలిపి వేశారని జీవన్ రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీపీఎల్ కుటుంబాలు 80% ఉంటాయన్న ఆయన... నిరుపేద వర్గాలను విడదీసే విధంగా పాలన చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని తెలిపారు. పద్మశాలి సంక్షేమం కాంక్షిస్తే యావత్ సమాజానికి కల్పించాలని... ఎస్టీ, ఎస్సీ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ క్రియేట్ చేశారు. కానీ నిధులు ఖర్చులు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు 30 వేల కోట్లు ఎస్సీ, 20 వేల కోట్లు ఎస్టీ క్యారీ ఫార్వార్డు చేయబడ్డాయన్న జీవన్ రెడ్డి.. దళితుల సంక్షేమానికి వేచ్చించలేకే అవి క్యారీ ఫారవార్డు అవుతున్నాయని చెప్పారు.
దేశ నిర్మాణంలోనూ కూడా కాంగ్రెస్ పాత్ర ఉంది...
వైట్ రేషన్ కార్డు కొత్త కుటుంబాల ఏర్పాటును బట్టి గతంలో కార్డులు జారీ అయ్యేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో ఒక కుటుంబం ఏర్పడుతుందన్న ఆయన... వీళ్లకు లక్ష రూపాయలతో పాటుగా, ప్రత్యేక రేషన్ కార్డు ఇవ్వమని.. పుట్టిన పిలగాల్లకి రేషన్ కార్డు ఇవ్వమని డిమాండ్ చేశారు. వజ్రోత్సవాలు అని సంబరపడుతున్నాం.. కానీ స్వాతంత్ర్యం... ఆ తర్వాత దేశ నిర్మాణంలోనూ కూడా కాంగ్రెస్ పాత్ర ఉందని గుర్తు చేశారు. కుల, మత విద్వేశాలకు ప్రాణాలు కోల్పోయిన నేతలు ఉన్న పార్టీ కాంగ్రెస్ నని... సద్భావన యాత్రతో ప్రపంచానికి శాంతి సందేశం అందించిన ఘనత రాజీవ్ గాంధీదని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాయికల్ లో వజ్రోత్సవాలను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహింపజేస్తామని తెలిపారు. ఆగస్టు15 న ఓల్డ్ బస్టాండ్ ఇందిరా గాంధీ విగ్రహ నుంచి పటేల్ చౌరస్తా మీదుగా జాతి పిత మహాత్మా గాంధీ (గాంధీనగర్ ) వరకు ర్యాలీ చేపడుతున్నామని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.