కారును ఢీకొన్న లారీ.. దంపతులను కాపాడిన సీటు బెల్టు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కారును ఢీకొట్టింది ఓ లారీ. కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో డివైడర్ దాటి పల్టీలు కొట్టింది కారు. ప్రమాదం నుంచి కారులో ప్రయాణిస్తున్న దంపతులు ప్రాణాలతో బయటపడ్డారు. స్వల్ప గాయాలయ్యాయి. 

కారులో ప్రయాణిస్తున్న గంగాధరకు చెందిన రామిడి జలపతి, విజయలక్ష్మి దంపతులు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరూ సీటు బెల్ట్ ధరించడంతో పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మొదటి బైపాస్ ఎల్ఐసీ ఆఫీస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 

విషయం తెలియగానే ఘటనా స్థలానికి పట్టణ సీఐ కరుణాకర్ చేరుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. కేసు నమోదు చేసుకున్నారు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లే జలపతి దంపతులకు ప్రమాదం తప్పిందని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ.. ప్రాణాలను రక్షించుకోవాలని సూచించారు సీఐ కరుణాకర్.