ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 21 మందికి బెయిల్

వరంగల్ : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డితో సహా 21 మందికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేసిన కేసులో రాకేశ్ రెడ్డితో సహా 21 మందిపై సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాకేష్ రెడ్డితో సహా 21మందిని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. 

అంతకుముందు.. మడికొండలోని పీటీసీలో రాకేష్ రెడ్డితో పాు మిగతా వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు పోలీసులు. ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు. నిరసన తెలిపేందుకు వెళ్లిన తమపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం పోలీసులు కేసులు నమోదు చేయలేదని చెప్పారు. ఏకపక్షంగా తమపైనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, జైలుకు పంపించాలని పోలీసులతో కుట్ర చేస్తున్నారని రాకేష్ రెడ్డి ఆరోపించారు.