లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ షేక్ జానీ అలియాస్ జానీ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు జానీ ని రిమాండుకి తరలించి విచారిస్తున్నారు. ఈ క్రమంలో జానీ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఫలించడం లేదు.
అయితే తాజాగా మరోసారి జానీ బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేశాడు. దీంతో ఈరోజు (అక్టోబర్ 9) జానీ బెయిల్ పిటిషన్‌పై రంగారెడ్డి పోక్సో ప్రత్యేక కోర్టు వాదనలు విన్నది. కేసును విచారించిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ క్రమంలో అక్టోబర్ 14న తీర్పు చెప్పబోతున్నట్లు పేర్కొంది. దీంతో అప్పటివరకు జానీ చంచల్‌గూడ సెంట్రల్ జైలులో రిమాండ్‌ను అనుభవించాల్సి ఉంటుంది.
ALSO READ | మనీలాండరింగ్ కేసులో కోర్టుని ఆశ్రయించిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులు.
ఈ విషయం ఇలా ఉండగా గతంలో జానీ తనకి అసిస్టెంట్‌గా పనిచేసిన లేడీ కొరియోగ్రాఫర్ మైనర్ గా ఉన్నప్పటినుంచే తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జానీపై పోక్సో కేసు నమోదు చేసి హైదరాబాద్ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. దీంతో అప్పటి నుంచి జానీ వ్యవహారం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.