సాత్విక్ కేసు నిందితులను చర్లపల్లి జైలుకు తరలింపు

నార్సింగి శ్రీచైతన్య కాలేజ్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్‌ సాత్విక్ సూసైడ్ కేసులో అరెస్టైన నలుగురికి.. ఉప్పర్ పల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితులుగా కళాశాల ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్, నరేష్‭లను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. రిమాండ్ నిమిత్తం నలుగురు నిందితులను ఉప్పరపల్లి కోర్టు నుండి చర్లపల్లి జైలుకు తరలించారు.  

సాత్విక్‌ సూసైస్ నోటు ద్వారా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కాలేజీలో సిబ్బంది వేధిస్తున్నారని లెటర్​ రాసి మంగళవారం రాత్రి సాత్విక్​ఆత్మహత్య చేసుకున్నాడు. సాత్విక్ తండ్రి రాజప్రసాద్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు సెక్షన్‌‌‌‌‌‌‌‌ 305 ఐపీసీ కింద ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ కేసులో కాలేజీ యాజమాన్యం సహా మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చారు. గురువారం హాస్టల్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌, వాచ్‌‌‌‌‌‌‌‌మెన్ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. వేధింపుల వల్లనే సాత్విక్‌‌‌‌‌‌‌‌ సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోస్‌‌‌‌‌‌‌‌ను స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ వద్ద సేకరించారు.  వైస్ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ ఆచార్య, లెక్చరర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌కృష్ణారెడ్డి, వార్డెన్‌‌‌‌‌‌‌‌ నరేశ్, శోభన్‌‌‌‌‌‌‌‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌ రికార్డ్‌‌‌‌‌‌‌‌ చేశారు. 41 సీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీసీ  కింద నోటీసులు జారీ చేశారు. శ్రీచైతన్య యాజమాన్యంపై తీసుకోవాల్సిన చర్యలపై లీగల్‌‌‌‌‌‌‌‌ ఒపీయన్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటున్నారు. నిందితులను కోర్టులో ప్రొడ్యూస్ చేసి.. రిమాండ్ నిమిత్తం చర్లపల్లికి తరలించారు.