అత్యాచారం కేసులో..నిందితుడికి పదేళ్ల జైలు


నల్గొండ అర్బన్, వెలుగు : మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.  ఎస్పీ అపూర్వ రావు వివరాల ప్రకారం.. నల్గొండలోని శ్రీరామ్ నగర్‌‌ కాలనీకి చెందిన చిందాల సుధీర్ కుమార్ అలియాస్ బాబురావు(56) హోటల్‌ కార్మికుడిగా పనిచేస్తుండేవాడు. 2021 డిసెంబర్‌‌ 31న ఇంటి పక్కన ఉండే మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం చేశాడు.

ALSO READ :పెద్దపల్లిలో దారుణం...కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య

బాధితురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.  సరైన ఆధారాలు కోర్టుకు సమర్పించడంతో మహిళా కోర్టు ఇన్‌చార్జి జడ్జి బి.తిరుపతి పరిశీలించి మంగళవారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానా విధించారు. ఈ కేసులో కీలకంగా పనిచేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌‌ను ఎస్పీ అభినందించారు.