హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజ్ కేసులో ముగ్గురు నిందితుల కస్టడీ విచారణ ఏప్రిల్ 6వ తేదీకి ముగియనుంది. ముగ్గురు నిందితులు రాజేందర్ కుమార్, ప్రశాంత్, తిరుపతయ్యను CCS నుంచి హిమాయత్ నగర్ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లనున్నారు. ఈ ముగ్గురు నిందితులు AE పేపర్ ను ఎంతమందికి ఇచ్చారు..? దీంట్లో జరిగిన ఆర్థిక లావాదేవీల కోణంలోనూ విచారించనున్నారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన 15 మంది నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించారు సిట్ అధికారులు. గ్రూపు 1 పేపర్ లీకేజీలో భాగంగా జగిత్యాల జిల్లా మాల్యాలలో పరీక్ష రాసిన అభ్యర్థులను విచారించారు. ప్రధాన నిందితుడు రాజశేఖర్ రెడ్డి మండలమైన మల్యాలలో రెండు రోజులుగా విచారణ సాగుతోంది. ఏప్రిల్ 5వ తేదీన ఐదుగురు అభ్యర్థులను విచారించారు. ఇప్పటి వరకూ 40 మంది అభ్యర్థుల వివరాలను సేకరించారు.
గ్రూప్ 1 లో 100 కి పైగా మార్కులు వచ్చిన వారందరినీ సిట్ ఆఫీస్ లో విచారిస్తున్నారు. మరోవైపు సిట్ అధికారులు FSL రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ రిపోర్ట్ వస్తే మరికొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశముందని తెలుస్తోంది.