మందు బాబులకు అలర్ట్: ఎండల్లో కూల్ బీరు వేస్తున్నారా.. ఆరోగ్యం దొబ్బుద్ది అంట.. నిజం తెలుసుకోండి..!

మందు బాబులకు అలర్ట్: ఎండల్లో కూల్ బీరు వేస్తున్నారా.. ఆరోగ్యం దొబ్బుద్ది అంట.. నిజం తెలుసుకోండి..!

ఇక చలికాలం అయిపోయినట్టే. మెల్లగా ఎండలు ముదురుతున్నాయి. కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసుల కాలం వచ్చేసినట్టే. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే మందుబాబులు ఈ వేసవి తాపాన్ని ఇంకో రకంగా తీర్చుకోవాలని చూస్తారు. ఎండాకాలం మొదలైందంటే బీర్లకి గిరాకీ పెరుగుతుంది. మిగతా ఆల్కహాలిక్ బేవరేజెస్ కన్నా సమ్మర్లో చల్లటి బీర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది.

అయితే ఎండ ఎక్కువ ఉందనే సాకుతో ఎక్కువ బీర్ తీసుకుంటే మాత్రం ముప్పు తప్పదు. బీరులో నీళ్ళశాతం ఎక్కువగా ఉంటుందని, అది తాగితే సమ్మర్ ఎఫెక్ట్ నుంచి బయటపడొచ్చని చాలామంది చెప్పేస్తుంటారు కానీ.. ఇవన్నీ అపోహలేనట. మందుబాబులు అనుకుంటున్న ట్లుగా వేసవిలో బీరు తాగితే మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశాలున్నాయి.

ALSO READ | Good Health : కొత్తిమీర తినటం కాదు తాగండి.. 30, 40 రోగాలను ఇట్టే మాయం చేస్తుంది.. తగ్గిస్తుంది..!

ఎక్సర్ సైజ్లు చేసిన తరువాత చాలామంది బాడీలో వాటర్ కంటెంట్ కోసం బీర్ తీసుకుంటూ ఉంటారు. బీర్ కు బదులు మామూలు నీళ్లు తీసుకున్నా సరిపోతుందట. బీర్ల కంటే నీరే ఎక్కువ చల్లదనం ఇస్తాయట. అంతేకాదు, శరీరం నుంచి చెమట రూపంలో వెళ్ళిపోయిన నీరు తిరిగి రికవరీ అవుతుంది.

నిజానికి బీరు తాగినప్పుడు శరీరం ఎక్కువ నీటిని పొందటం కంటే మూత్రం ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. ఇలా జరగడం శరీరానికి మంచిది. కాదు. అయితే, ఆల్కహాల్ లేని బీరు తాగినప్పుడు మాత్రం ఇలాంటి ఇబ్బంది లేదు.అందుకే సమ్మర్లో ఆల్కహాల్ జోలికి వెళ్లకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

వెలుగు, లైఫ్