- మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా న్యాయస్థానం తీర్పు
భోపాల్ : తన అత్తను 95 సార్లు కత్తితో పొడిచి హత్య చేసిన 24 ఏండ్ల మహిళకు మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లా కోర్టు బుధవారం ఉరిశిక్ష విధించింది. ఈ కేసులో తుది వాదనలు ముగిసిన తర్వాత నిందితురాలు కాంచనను కోర్టు దోషిగా నిర్ధారించిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీడియాకు తెలిపారు. మృతురాలి భర్త వాల్మీక్ కోల్‌ను కూడా ఈ కేసులో సహ నిందితుడిగా పోలీసులు చేర్చినప్పటికీ సాక్ష్యాలు లేకపోవడంతో అతడిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసిందన్నారు.
మధ్యప్రదేశ్‌లోని మంగవా పోలీస్ స్టేషన్ పరిధి అత్రైలా గ్రామానికి చెందిన కాంచనకు ఆమె 50 ఏండ్ల అత్త సరోజ్ కోల్‌కు మధ్య ఇంటి గొడవలున్నాయి. రెండేండ్ల కింద 2022 జులై 12న కాంచన తన అత్తను పదునైన కత్తితో 95 సార్లు పొడిచింది. ఇంటికి వచ్చిన ఆమె కొడుకు పోలీసులకు సమాచారం ఇచ్చి రక్తపుమడుగులో పడిఉన్న తల్లిని ఆస్పత్రికి తరలించాడు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు.