15 రోజులకు ఇంటికి చేరిన గల్ఫ్‌‌కార్మికుడి డెడ్‌‌ బాడీ

 15 రోజులకు ఇంటికి చేరిన గల్ఫ్‌‌కార్మికుడి డెడ్‌‌ బాడీ

మెట్ పల్లి, వెలుగు : గల్ఫ్‌‌ లో 15 రోజుల కింద చనిపోయిన కార్మికుడి డెడ్‌‌ బాడీ ఆదివారం ఇంటికి చేరింది. వివరాలిలా ఉన్నాయి.. జగిత్యాల జిల్లా మెట్‌‌ పల్లి మండలం రాంనగర్‌‌ ‌‌ కు చెందిన మంగలి దశరథం (56) 24 ఏండ్లుగా ఉపాధి కోసం దుబాయ్‌‌  షార్జాలో పనిచేస్తున్నాడు. డ్యూటీలో ఉండగా జూన్ 30న దశరథం బ్రెయిన్‌‌  స్ట్రోక్‌‌ తో పడిపోగా తోటి కార్మికులు హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు చనిపోయాడు. సమాచారం అందుకున్న కుటుంబసభ్యులు దశరథం డెడ్‌‌ బాడీ తీసుకురావాలని గల్ఫ్ కార్మిక సంక్షేమ సంఘాల ప్రతినిధులను సంప్రదించారు.

దీంతో వారు అక్కడి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి డెడ్‌‌ బాడీని ఇండియాకు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం డెడ్‌‌ బాడీ హైదరాబాద్‌‌ కు చేరుకోగా ఎన్‌‌ ఆర్‌‌ ‌‌ ఐ ఆఫీసర్‌‌ ‌‌  చిట్టిబాబు సహకారంతో దశరథం ఇంటికి చేరింది. ఈ సందర్భంగా గల్ఫ్‌‌  సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ విదేశాల్లో చనిపోయే కార్మికుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌‌ గ్రేషియా అందించాలని డిమాండ్‌‌  చేశారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు.