మరోసారి జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పెంపు

మరోసారి జర్నలిస్టుల అక్రిడిటేషన్ గడువు పెంపు

 తెలంగాణలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడిటేషన్ (ఐడీ కార్డు) గడువును మరో మూడు నెలల పాటు (మార్చి 31, 2025 వరకు) పొడిగించారు. ఈమేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ హరీశ్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.  డిసెంబర్  31వ తేదీతో కార్డుల గడువు ముగియనుండగా.. పలు కారణాల వల్ల దీనిని మరో 3 నెలల పాటు పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొ న్నారు. 

దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ ఎండీకి లేఖ రాసినట్లు తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టుల కోసం ప్రతి రెండేండ్లకోసారి అక్రిడిటేషన్ సదుపాయం రాష్ట్ర సమాచార శాఖ కల్పిస్తోంది. వాస్తవానికి ఈ గడువు జూన్ 30తో ముగియగా.. ఇప్పటి కే రెండుసార్లు పొడిగించారు. తాజాగా మరో మూడు నెలలు ఎక్స్టెండ్ చేశారు.