వచ్చె నెల 18 వరకు ‘నిమ్స్’ టెండర్ల గడువు

హైదరాబాద్, వెలుగు: నిమ్స్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దశాబ్ది బ్లాక్ నిర్మాణ టెండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చే నెల 18 వరకు ఆర్ అండ్ బీ గడువు పొడిగించింది. ఈ మేరకు త్వరలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. వాస్తవానికి ఈ నెల 12 వరకు టెండర్ దాఖలు చేసేందుకు ఆర్ అండ్ బీ గడువు విధించింది. అయితే, టెండర్ డాక్యుమెంట్ ఫైనల్ కాకపోవడం, పలు సవరణలు ఉండటంతో ఆలస్యం అయినట్లు అధికారులు చెబుతున్నారు. రూ.1,571 కోట్లతో నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 వేల బెడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిర్మించనున్న దశాబ్ది బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు గత నెలలో సీఎం కేసీఆర్ శంకుస్ధాపన చేశారు.

ALSO READ:రైతు రుణమాఫీపై సీఎం పూటకో మాట : షర్మిల