హైడ్రా వ్యర్థాల తొలగింపు, కూల్చివేతలకు టెండర్లు క్లోజ్

హైడ్రా వ్యర్థాల తొలగింపు, కూల్చివేతలకు టెండర్లు క్లోజ్

తెలంగాణలో హైడ్రా కోరిన టెండర్ల గడువు ముగిసింది. హైడ్రా కుల్చివేతలు, కూల్చిన వ్యర్ధాల తొలిగింపు కోసం టేండర్లు పిలిచింది. ఇందుకు ముగ్గురు కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. 20 ఫోర్ల బిల్డింగ్ కూల్చేసే సామర్ధ్యం ఉన్న హైరేంజ్ మెషిన్లు ఉండాలని, 5 ఫ్లోర్ల బిల్డింగ్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూల్చే సామర్థ్యం ఉన్న మెషిన్లు ఉండాలని హైడ్రా నిబంధనలు పెట్టింది . 

రెండు లేదా మూడు రోజుల్లో కాంట్రాక్ట్ ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సామగ్రి, వ్యర్థాల తొలగింపు కాంట్రాక్ట్ ఫైనల్ అయిన తర్వాత.. హైరేంజ్ బిల్డింగ్స్ కూల్చివేతపై హైడ్రా దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

ALSO READ | కన్నబిడ్డల్లా చూసుకుంటాం.. మూసీ నిర్వాసితులకు మంత్రి శ్రీధర్ బాబు భరోసా

కూల్చివేతల వ్యర్థాలను తొలగించేందుకు ఆఫ్​లైన్​లో టెండర్లను ఆహ్వానిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటన జారీ చేశారు. సెప్టెంబర్ 19 నుంచి 27 వరకు బిడ్స్ స్వీకరించారు. ఈ మేరకు బుద్ధభవన్​లోని ఏడో అంతస్తులోని హైడ్రా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఏడాది కాల పరిమితితో బిడ్స్ స్వీకరించారు. బిడ్స్ దాఖలు చేసే కాంట్రాక్టర్లు తమ ప్రతిపాదనలను సీల్డ్ కవర్లలో సమర్పించాలని రంగనాథ్ ఆదేశించారు. గడిచిన రెండు నెలల్లో 23 ప్రాంతాల్లో 262 అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా 111 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.