నల్గొండ, వెలుగు : రెండో విడత గొర్రెల పంపిణీకి ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో రెండో విడత కింద అప్లై చేసుకున్న లబ్ధిదారులను క్షేత్ర స్థాయిలో విచారించేందుకు సోమవారం నుంచి పశుసంవర్ధక శాఖ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో రెండో విడత కింద 37,078 మంది దరఖాస్తు చేశారు. దీంట్లో 4,800 మం ది లబ్ధిదారులకు మునుగోడు ఉప ఎన్నికల్లో గొర్రెలు పంపిణీ చేశారు.
మిగతా 32,278 మంది లబ్ధిదారులకు గొర్రెలు ఇవ్వాల్సి ఉంది. ఈ నెల 15 నుంచి గొర్రెల కొనుగోళ్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని అధికారులను నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి అన్ని గ్రామాల్లో వెటర్నరీ ఆఫీసర్లు ఇంటింటికీ తిరిగి లబ్ధిదారుల వివరాలు సేకరించనున్నారు. దరఖాస్తుదారుల్లో ఎందరు ఎవరైనా చనిపోతే నామినీ వివరాలు, ఆధార్‌కార్డు, బ్యాంకు అకౌంట్లు సేకరిస్తారు. లబ్ధిదారుడు వాటా కింద చెల్లించాల్సిన రూ.43,750 డీడీ కట్టిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తి య్యాక లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో ఎంటర్ చేస్తారు.
కలెక్టర్లకే ఫుల్ పవర్స్...
2017-–18లో పథకం ప్రారంభం నాటి గైడ్‌లైన్స్‌నే ఇప్పుడు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యలో కొన్నాళ్లు పశుసంవర్ధక శాఖ డిపార్ట్మెంట్కు అప్పగించారు. దీనివల్ల గొర్రెల రీస్లైకింగ్ జరిగిందని అన్ని వైపులా ఆరోపణలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో రెండో విడతలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు కలెక్టర్లకే ఫుల్ పవర్స్ అప్పగించారు. మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కమిటీలు ఏ ర్పాటు చేసి గొర్రెలు కొనాలని నిర్ణయించారు.
జిల్లా స్థాయిలో కమిటీలకు కలెక్టర్ చైర్మన్‌గాను, మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్లను చైర్మన్లుగా నియమించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సోమవారం జిల్లా స్థాయి లో మీటింగ్ జరగనుంది. ఏ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను కమిటీలో చేర్చాలనే దాని గురించి చర్చిస్తారు. అనంతరం మండల కమిటీ ఆఫీసర్ల నేతృత్వంలోనే రైతులను వెంటపెట్టుకుని గొర్రెలు కొనడం జరుగుతుంది.
గొర్రెల కొనుగోలుకు10 రాష్ట్రాల ఎంపిక...
తెలంగాణ, ఏపీలో గొర్రెలు దొరకడం కష్టంగా ఉండటంతో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనేందుకు పది రాష్ట్రాలను సెలక్ట్ చేశారు. ఏపీలో అనంతపురం జిల్లాతోపాటు, తమిళనాడు, కర్నాటక, మహారా ష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో గొర్రెలు ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఈ రాష్ట్రాల్లో 3.80కోట్ల గొర్రెలు ఉండగా, వీటిల్లో తెలంగాణకు రెండో విడతలో 84 లక్షలు అవసరం ఉందని అధికారులు అంచనా వేశారు.
అధికారుల ఫీల్డ్ సర్వే ముగిశాక, దాన్ని బట్టి ఆయా రాష్ట్రాల్లో గొర్రెలు కొనేందుకు అధికారుల బృందం ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లనుంది. ఈలోగా గొర్రెల రవాణాకు సంబంధించిన ట్రాన్స్పోర్ట్ టెండర్లు జిల్లా స్థాయిలో పిలవనున్నారు. మొత్తం యూనిట్ కాస్ట్ రూ.1.75 లక్షలు కాగా, దీంట్లో లబ్ధిదారుల వాటా రూ.43,750లు చెల్లించాల్సి ఉంది. ఒక పొట్టేలు, 20 గొర్రె పిల్లలు అందజేస్తారు.
లబ్ధిదారుల జాబితా సిద్ధం చేస్తున్నం
రెండో విడత గొర్రెల పంపిణీకి ఏర్పాట్లు జరుగుతు న్నాయి. జిఇప్పటికే జిల్లా కలెక్టర్ల తో మీటింగ్‌లు పెట్టినం. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక క మిటీలు నియమిస్తున్నాం. ఎక్కడా గొర్రెల రీసైక్లింగ్ జరగకుండా ఉండేందు కు పకడ్బందీ చర్యలు చేపట్టినం. ఈ నెల 15 నుంచి రెండో విడత మొదలు పెడ్తం. దీనికి సంబంధిం చి లబ్ధిదారుల జాబితా ప్రిపేర్ చేస్తున్నం. నాలుగైదు రోజుల్లో కంప్లీట్ చేశాక, గొర్రెలు కొనేందుకు ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాలకు బయల్దేరి వెళ్తాయి. – దూదిమెట్ల బాలరాజుయాదవ్, రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెట్ కార్పొరేషన్ చైర్మన్