గోకుల్ చాట్, లుంబినీ పేలుళ్ల టెర్రరిస్టులకు 10 ఏళ్లు జైలు

ఢిల్లీ : దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్ర కేసులో ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు నిందితులకు జైలు శిక్ష ఖరారు చేసింది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్, ఢిల్లీ పేలుళ్లకు ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఉబేద్ రెహమాన్, ఇమ్రాన్ ఖాన్, ధనిష్ అన్సారీ, ఆఫ్తాబ్ ఆలమ్ కు 10 ఏళ్ల శిక్ష విధించింది NIA కోర్టు. తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్ తో కలిసి దేశంలో పేలుళ్లకు కుట్రపన్నారు నిందితులు. హైదరాబాద్ లోని గోకుల్ చాట్, లుంబినిపార్క్, దిల్ షుక్ నగర్ జంట పేలుళ్లతోపాటు  వారణాసి, ముంబై, ఫజియాబాద్, ఢిల్లీ పేలుళ్లలోనూ నిందితుల పాత్ర ఉన్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. హైదరాబాద్, బెంగళూరు పేలుళ్లలోనూ నలుగురి పాత్ర ఉన్నట్లు గుర్తించారు దర్యాప్తు అధికారులు. 

Also Read :- ఎల్​ఐసీ నిర్వహణలో టీటీడీ లడ్డూ కౌంటర్లు