పక్కా ప్లాన్ తో అర్ధరాత్రి నుంచే..

పక్కా ప్లాన్ తో అర్ధరాత్రి నుంచే..

సెక్రటేరియట్ కూల్చివేత, కొత్త బిల్డింగ్ల నిర్మాణంపై వారం రోజుల కింద సర్కారుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచే సెక్రటేరియట్ కూల్చివేతపై సర్కారు దృష్టిపెట్టింది. అందులో కొనసాగుతున్న ఐటీ విభాగాన్ని ఆఫీసర్లు హడావుడిగా ఖాళీ చేయించి గేటుకు తాళం వేసేశారు. అయితే సెక్రటేరియట్ బిల్డింగ్స్ను కూల్చొద్దని.. కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో స్పెషల్ హాస్పిటల్గా ఆ బిల్డింగ్లను ఉపయోగించుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో పగటి పూట కూల్చివేత ప్రారంభిస్తే ఆందోళనలు జరిగే చాన్స్ ఉందని భావించిన సర్కారు.. సోమవారం అర్ధరాత్రి హడావుడిగా, భారీ బందోబస్తు మధ్య కూల్చివేత పనులను మొదలుపెట్టింది. మరోవైపు తాత్కాలిక సెక్రటేరియట్కు మంగళవారం అనఫీషియల్గా సెలవు ప్రకటించారు. ఉద్యోగులెవరూ డ్యూటీకి రావొద్దని ఆదేశించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం