
కోల్‌కతా: బెంగాలీ నటి, డర్టీ పిక్చర్ లాంటి పలు బాలీవుడ్ ఫిల్మ్స్‌లో నటించిన ఆర్యా బెనర్జీ (33) చనిపోయింది. ఆర్య సొంతూరు కోల్‌కతా. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విద్యా బాలన్ హీరోయిన్‌గా మిలన్ లూథ్రియా డైరెక్షన్‌లో 2011లో వచ్చిన డర్టీ పిక్చర్‌లో షకీలా పాత్రలో ఆర్య అలరించింది. రిపోర్టు ప్రకారం.. ఇవ్వాళ ఉదయం నుంచి ఆర్య ఫోన్స్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతోపాటు డోర్ బెల్ కొట్టినా స్పందించడం లేదని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఇంటి తలుపును బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. బెడ్‌రూమ్‌లో ఆర్య అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించారు. ఆమె అప్పటికే చనిపోయింది. ఆర్యా బెనర్జీ మృతి పై బెంగాలీ, హిందీ నటులు విచారం వ్యక్తం చేశారు. ఆమెను గుర్తు చేసుకుంటూ ట్వీట్లు చేశారు.
She was the daughter of Sitar maestro Nikhil Banerjee. A very talented girl…who used to sing and dance like a rock-star. She amazed us with her acting and dancing stint in films like LSD, Dirty picture. will miss u forever. ? #aryabanerjee #DevduttaBanerjee pic.twitter.com/XjXAeB4EHb
— Bidita Bag ?? (@biditabag) December 11, 2020