ఇంటి నుంచి వెళ్లిన బాలుడు మిస్సింగ్..

రంగారెడ్డి జిల్లాలో 12 సంవత్సరాల విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. రాజేంద్రనగర్ పోలీస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ లో విద్యార్థి సాయి చరణ్ కనిపించకుండాపోయాడు. బుధవారం (జులై 12న) రాత్రి చిట్టి డబ్బులు ఇవ్వడానికి బయటకు వెళ్లిన సాయి చరణ్.. ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్ల వెతికారు. తెలిసిన వారందరిని వాకబు చేశారు.  

Also Read :-  ఆర్‌‌‌‌ఎంపీలకు మెడికల్ ట్రైనింగ్ : మంత్రి హరీశ్‌‌ రావు

ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో చివరకు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి చరణ్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి కూడా అన్ని చోట్ల గాలించారు పోలీసులు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కిడ్నాప్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.