విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు.. పోటీగా 30 మంది బౌన్సర్లను దింపిన మంచు మనోజ్..!

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దాకా వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ పిలిపించాడు. మనోజ్ తరపు బౌన్సర్లను జల్పల్లిలోని మోహన్ బాబు ఫాంహౌస్ సెక్యూరిటీ లోపలికి అనుమతించలేదు. దుబాయ్ నుంచి మంచు విష్ణు మోహన్ బాబు ఇంటికి రానున్నాడు. ఫామ్ హౌస్కి మంచు లక్ష్మి చేరుకుంది.

సినీ నటుడు మోహన్​బాబు కుటుంబంలో విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. పోలీసుల కథనం ప్రకారం.. కొన్నాళ్లుగా సినీ నటుడు మోహన్ బాబు ఆయన కొడుకు మంచు మనోజ్, ఆయన భార్య, ఇతర కుటుంబ సభ్యులు జల్పల్లిలోని ఫాంహౌస్​లో ఉంటున్నారు. ఆదివారం తన తండ్రి దాడి చేశాడని మంచు మనోజ్ డయల్​100 కు ఫోన్ చేసి చెప్పారు. పహాడీ షరీఫ్ పోలీసులు జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటికి వెళ్లి విచారణ జరిపారు. తమ కుటుబంలో విబేధాలు ఉన్నాయని, వాటిని తామే పరిష్కరించుకుంటామని మోహన్​బాబు చెప్పడంతో వెళ్లిపోయారు.

Also Read:-నాగచైతన్యతో పెళ్లి ఫొటోల్ని షేర్ చేసిన శోభిత..

కాగా, సాయంత్రం మనోజ్​బంజారాహిల్స్​రోడ్డు నంబరు 12లోని టీఎక్స్​ దవాఖానకు తన భార్య మౌనికతో కలిసి వచ్చాడు. మనోజ్​మెడ, కాళ్లకు గాయాలయ్యాయని, వాపు వచ్చిందని ట్రీట్మెంట్​చేసిన డాక్టర్లు చెప్పారు. మెడ తిప్పలేకపోతున్నాడని చెప్పారు. సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్తో పాటు ఎక్స్​రే తీశారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. 24  గంటలు పాటు అబ్వర్వేషన్ లో ఉండాలని డాక్టర్లు చెప్పగా, సోమవారం మళ్లీ వస్తానని వెళ్లిపోయారని తెలిసింది. దీనిపై మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డిని వివరణ కోరగా 100 డయల్​కు కాల్ వచ్చిందని, పోలీసులు విచారణ జరిపారని, కుటుంబ గొడవ అని చెప్పడంతో ఎలాంటి కేసు నమోదు కాలేదని తెలిపారు.