యాదాద్రి భువనగిరి జిల్లా: జిల్లాలో అక్రమాలకు పాల్పడుతున్న మూడు ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారులు సీజ్ చేశారు. గవర్నమెంట్ దవాఖానకు వెళ్తున్న రోగులను మభ్య పెట్టి.. ప్రైవేట్ హాస్పిటల్స్ తరలిస్తున్నారన్న ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. పట్టణంలోని సాయితేజ నర్సింగ్ హోమ్, తేజస్విని హాస్పిటల్, సాయితేజ డయగ్నోస్టిక్ సెంటర్లను కలెక్టర్ ఆదేశాలతో సీజ్ చేసినట్లు జిల్లా వైద్యాధికారి సాంబశివరావు తెలిపారు. ఈ కేసులో కీలక నిందితుడైన నరేశ్ కు నోటీసులు అందించామన్నారు. అదే విధంగా నిందితుడికి సహకరించిన జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు చెందిన 41మందికి నోటీసులు ఇచ్చామన్నారు. సీజ్ చేసిన హాస్పిటల్ లోని రోగులను ప్రభుత్వాసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...
ఆఫీసులకు వచ్చేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపట్లే
ప్రైవేటు ల్యాబ్‌లతో ఎంజీఎం సిబ్బంది కుమ్మక్కు
టీ20 వరల్డ్‌కప్‌లో ఫినిషర్‌గా కార్తీక్ పనికొస్తాడు