ప్రపంచం మొత్తం మీద ఉన్న పుట్టబోయే బిడ్డల డీఎన్‌ఏ సేకరించే పనిలో పడింది చైనా. ఇలా సేకరించిన డీఎన్‌ఏ ద్వారా కొత్త తరం మానవుడి(సూపర్ హ్యూమన్)ని తయారు చేసే ప్రయత్నం చేస్తోంది. ఇది భవిష్యత్‌లో జరిగే మార్పు అయినా.. మనం ఇప్పుడే గ్రహించాల్సిన అంశం. ఎందుకంటే చైనా కరోనా వైరస్‌ను ఎలాగైతే ప్రపంచ దేశాలపైకి వదిలిందో.. అలాగే ఈ సూపర్ హ్యూమన్ ని కూడా ప్రపంచ దేశాలపైకి వదులుతుందేమో అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ సూపర్ హ్యూమన్స్ కూడా మనిషి మనుగడకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. వీరికి మానవత్వం ఉండదు. మంచుకొండల్లో ఎలాగైతే పని చేస్తారో ఎడారిలోనూ అదే విధంగా పని చేస్తారు. వాతావరణ మార్పుతో వీరికి సంబంధం ఉండదు. ఎందుకంటే వీరి డీఎన్‌ఏని సేకరించి ఎడిట్ చేసి సాధారణ మానవుని డీఎన్‌ఏ కంటే దృఢంగా ఉండేలా తయారు చేస్తారు. దాని మూలంగా వీరు అత్యంత శక్తిమంతులుగా తయారవుతారు.
బీజీఐ, పీఎల్ఏ కలిసి..
చైనాలో మనిషి జీన్స్‌పై స్టడీ చేసే బీజింగ్ జెనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్(బీజీఐ) గ్రూప్, చైనా ఆర్మీతో కలిసి ఈ సూపర్ హ్యూమన్‌ను రెడీ చేసే పనిలో ఉంది. ప్రపంచం మొత్తం మీద 80 వేల మంది మహిళల గర్భంలో ఉండే శిశువుల డీఎన్‌ఏ జెనెటిక్ డేటాను బీజీఐ సేకరించింది. ఈ డేటా ఆధారంగానే సూపర్ హ్యూమన్స్ తయారిపై దృష్టిపెట్టింది. శత్రుదేశంతో యుద్ధంలో గెలిచేలా వారిని రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. బీజింగ్ జెనోమిక్స్ ఇన్‌స్టిట్యూట్, పీపుల్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) కలిసి గర్భవతుల కోసం నిఫ్టీ టెస్ట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 2013లోనే బీజీఐ ప్రపంచ దేశాల్లో ఈ టెస్ట్ మార్కెటింగ్‌ను ప్రారంభించింది. ఈ పరీక్ష ద్వారా గర్భం దాల్చిన మహిళల శరీరం నుంచి డీఎన్‌ఏ శాంపిల్స్‌ను తీసుకొని పరిశీలిస్తారు. దీని ద్వారా పుట్టబోయే బిడ్డ ఏమైనా జన్యుపరమైన లోపాలతో పుట్టొచ్చా అనే విషయాన్ని తెలుసుకుంటారు.
52కు పైగా దేశాల్లో టెస్టులు
ఈ పరీక్ష టెక్నిక్స్‌ను బీజీఐ 52కుపైగా దేశాలకు పంపించింది. అందులో బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇండియా ఇలా ఎన్నో దేశాలు ఉన్నాయి. నిఫ్టీ టెస్ట్‌ను రూ. 13 వేలకు డీఎన్‌ఏ టెస్ట్ ల్యాబ్‌లో చేస్తారు. దీని రిపోర్ట్ 7 నుంచి 10 రోజుల్లో వస్తుంది. ఎప్పుడైతే గర్భవతికి ఈ టెస్ట్ చేస్తారో ఆ పరీక్ష జెనెటిక్ డేటా చైనాలోని బీజీఐ గ్రూప్‌కు అందుతుంది. బీజీఐ ఆ రిపోర్ట్‌ను చైనా గవర్నమెంట్‌కు అందజేస్తుంది. ఈ రిపోర్ట్‌ను చైనా తనకు నచ్చిన విధంగా ఉపయోగించుకుంటుంది. న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. బీజీఐ గ్రూప్ రక్త నమూనా పరీక్షలను హాంకాంగ్‌లోని ల్యాబ్స్‌లో చేయిస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రజలపైనా ఇక్కడ రీసెర్స్ చేస్తారు. దానికి సంబంధించిన డేటాను చైనాలోని షెన్‌జెన్ లోని జెన్ డేటా బ్యాంక్‌లో జమ చేస్తారు. యూరప్, ఆసియా నుంచే ఎక్కువ డేటాను చైనా సేకరించిందని రాయిటర్స్ రిపోర్టు చెబుతోంది.
డీఎన్ఏ సేకరణ కష్టం కాదు
మనిషి నుంచి డీఎన్‌ఏ డేటాను సేకరించడం పెద్ద సమస్యేం కాదు. వ్యక్తి వాడిన దుస్తులు, వెంట్రుకలు, వస్తువుల నుంచి దాన్ని సేకరించవచ్చు. మొబైల్‌లోని డేటాను దొంగిలించడం కంటే డీఎన్‌ఏ డేటాను దొంగిలించడం చాలా సులువు. ఇలా దొంగిలించిన డేటా ఆధారంగా చైనా భవిష్యత్‌లో సూపర్ హ్యూమన్స్ పేరుతో సైనికులను తయారు చేయాలనుకుంటోంది.
- ఆర్.అక్షయ్ కుమార్, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్