గచ్చిబౌలి, వెలుగు: తన క్లినిక్‌ను అప్పగించాలని బిల్డింగ్ ఓనర్లు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఓ డాక్టర్ రాయదుర్గం పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. తనను క్లినిక్‌లోకి రానివ్వకుండా గేట్‌కు తాళాలు వేసి అడ్డుకుంటున్నారని సైబరాబాద్ సీపీతోపాటు హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్‌ను కూడా ఆశ్రయించినట్లు బాధితురాలి తెలిపింది. ఆమె కథనం ప్రకారం.. మణికొండకు చెందిన డా.ప్రశాంతి లక్ష్మీనగర్‌లోని రిటైర్డ్పోలీస్ అధికారి ఉదయ భాస్కర్‌రెడ్డికి చెందిన బిల్డింగ్ గ్లౌండ్ ప్లోర్‌ను 2022 నుంచి అద్దెకుతీసుకొని సేవియర్ కేర్మల్టీ స్పెషాలిటీ క్లినిక్‌ను నిర్వహిస్తోంది.
ఇది బాగా రన్అవుతుండడంతో గతేడాది నుంచి తమకు అప్పగించాలని ఆమెను బిల్డింగ్ ఓనర్లు ఒత్తిడి చేస్తున్నారు. ఏప్రిల్5న తనను బిల్డింగ్‌లోకి రాకుండా అడ్డుకోవడంతో పోలీసుల సహాయంతో వెళ్లానని బాధితురాలు తెలిపారు. తాను ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలో మూడు నెలల పాటు క్లినిక్‌కు వెళ్లలేదని, ఆ సమయంలో లోపల ఉన్న మెడికల్ సామాగ్రి, సీసీ కెమెరాలు, డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.