లాజిస్టిక్స్ పరిశ్రమ ఆదాయాలు అప్

లాజిస్టిక్స్ పరిశ్రమ ఆదాయాలు అప్

న్యూఢిల్లీ: దేశీయ రోడ్డు లాజిస్టిక్స్ పరిశ్రమ ఆదాయం 2024-25 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది శాతం వరకు వృద్ధిని నమోదు చేయవచ్చని రేటింగ్​ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది.  2023–-24 ఆర్థిక సంవత్సరంలో ఆర్గనైజ్డ్ రోడ్ లాజిస్టిక్స్ రంగం 4.6 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపింది.  2024 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ 23,273 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది.

2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ రోడ్, లాజిస్టిక్స్ పరిశ్రమ ఆదాయాలు సంవత్సరానికి మధ్యస్థంగా 6–-9 శాతం పెరుగుతాయని ఇక్రా పేర్కొంది.  ఈ–-కామర్స్, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ గూడ్స్ వంటి సెగ్మెంట్ల నుంచి మంచి డిమాండ్ బాగుంటుందని భావిస్తున్నారు. 2024లో ద్రవ్యోల్బణం, అసమాన రుతుపవనాలు, పండుగ సీజన్ డిమాండ్​నెమ్మదించిన కారణంగా ఈ రంగం వృద్ధి తగ్గింది.