- బెల్లంపల్లిలోని బిల్డింగ్లో చోరీ
- కట్టి నాలుగేండ్లవుతున్నా స్వాధీనం చేసుకోని పోలీస్ శాఖ
బెల్లంపల్లి, వెలుగు : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రామ్ నగర్ లో కొత్తగా కట్టిన పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ భవనంలో తలుపులు, ఫ్యాన్లు, ఎలక్ట్రికల్సామగ్రిని దొంగలు ఎత్తుకుపోయారు. ఈ చోరీ బుధవారం రాత్రి లేదా అంతకుముందే జరిగి ఉంటుందని తెలుస్తోంది. బిల్డింగ్ కాంట్రాక్టర్ బెల్లంపల్లి వన్ టౌన్ ఇన్స్పెక్టర్ శంకరయ్య కు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
కమాండ్కంట్రోల్సెంటర్లోని 10 టేకు తలుపులు, 14 ఫ్యాన్లు, ఎలక్ట్రికల్, శానిటేషన్ పరికరాలు ఎత్తుకుపోయారని ఆయన కంప్లయింట్లో పేర్కొన్నారు. బిల్డింగ్నిర్మాణం పూర్తయి నాలుగేండ్లవుతున్నా పోలీస్ శాఖ హ్యాండోవర్ చేసుకోకపోవడం దొంగలకు వరంగా మారింది. ఖాళీగా ఉంటుందని గుర్తించి చోరీ చేసినట్టు తెలుస్తోంది.