హైదరాబాద్​ లో నాళాల పూడికతీతకు టెండర్లు ఖరారు.. జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్​ లో నాళాల పూడికతీతకు టెండర్లు ఖరారు.. జూన్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశం
  • నాలాల పూడికతీత షురూ
  • వానాకాలంలో ఇబ్బందుల్లేకుండా బల్దియా ముందస్తు చర్యలు  
  • రూ.55 కోట్లతో203 పనులకు టెండర్లు
  • కొన్ని చోట్ల మొదలైన పనులు 
  • జూన్ ఫస్ట్​ వీక్​లోగా పూర్తి  చేయాలని కమిషనర్ ఆర్డర్స్​ 

 హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాకాలంలో సిటీలోని నాలాల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు తలెత్తుతుండడంతో ముందస్తుగా ఈ ఎండాకాలంలోనే పూడికతీతకు బల్దియా సిద్ధమైంది. దీనికి సంబంధించి రూ.55 కోట్లతో 203 పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసి కొన్నిచోట్ల పనులు కూడా మొదలుపెట్టారు. 

మే చివరలో లేదా జూన్ మొదటివారంలోగా పనులు పూర్తి చేయాలని కమిషనర్​ఇలంబరితి ఆదేశించారు. నాలాల పూడికతీత పనులకు సంబంధించి గత బీఆర్ఎస్​హయాంలో అనేక అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో.. ఇప్పుడు పూడికతీత విషయంలో ఏవైనా తేడాలు వస్తే స్థానిక సర్కిల్ ఇంజినీర్లనే బాధ్యులను చేయనున్నారు. గతంలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారు.

బీఆర్ఎస్ హయాం.. అవినీతిమయం  

బ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల్దియా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రిధిలో దాదాపు వెయ్యి కిలో మీట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ల మేర వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్షపు నీటి కాల్వలు ఉండగా.. ఇందులో మేజ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ నాలాలు 398 కిలో మీట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లు,  పైపులైన్ డ్రైన్లు, చిన్న సైజు నాలాలు 600 కిలో మీట‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్లకు పైగా ఉన్నాయి.  ప్రతిఏటా పూడికతీత కోసం జీహెచ్ఎంసీ  రూ.40 కోట్ల నుంచి రూ.55 కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. బీఆర్ఎస్​హయాంలో ఏడాది పాటు నిరతంర ప్రక్రియగా పూడికతీత పనులు చేస్తామని అప్పటి మంత్రులు ప్రకటించారు. కానీ, ఎప్పుడూ అలా జరగలేదు. అసలు నాలాల పూడికతీత సంగతే పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. 

రెండేండ్లకు ఒకసారి కూడా వందశాతం పూడిక తీయలేదు. కొన్ని నాలాల్లో కనీసం అడ్డుగా ఉన్న వ్యర్థాలను కూడా తొలగించలేదు. పూడికతో 2020 వరదలు వచ్చినప్పుడు నాలాలు ఎక్కడికక్కడ ఉప్పొంగాయి. తర్వాత నామమాత్రపు పనులు చేసి వదిలేశారు. 2021, 2002 సంవత్సరాల్లో పూడికతీత పనుల్లో అక్రమాలు జరిగాయని విజిలెన్స్ డిపార్ట్​మెంట్​గుర్తించింది. 2021లో నాలాల పూడికతీత పనులు రూ.44 కోట్లతో చేసినప్పటికీ, సగానికిపైగా నాలాల్లో పూడిక తీయలేదని తేలింది. దీనికి బాధ్యులుగా 15 మంది ఇంజినీర్లకు షోకాజ్​నోటీసులు ఇచ్చారు. 2022లో 38మంది అధికారుల వేతనాల్లో కోతలు విధించారు.

ఈ సారి పక్కాగా...

గతంలో నాలాల పూడికతీతలో జరిగిన అవినీతి, అక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఎటువంటి అవకతవకలు, జరగకుండా వందశాతం పూడిక తీసేలా కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ముందుగా ప్రమాదకరంగా, ఓపెన్ గా ఉన్న నాలాలకు సర్కిల్ స్థాయి అధికారులు ఫెన్సింగ్ లు వేయించనున్నారు. పూడిక తీస్తున్న కాంట్రాక్టర్లు పారదర్శకంగా పనులు చేసేందుకు నాలాలను విభజించి ఎక్కడి నుంచి ఎంత పూడిక తీశారన్నది తూకం వేయడంతో పాటు ఆ పూడికను తరలించే వాహనాల నెంబర్లను సైతం రికార్డులో రాయనున్నారు.