
పంజాగుట్ట,వెలుగు : డ్రగ్స్ సప్లై ముఠాను సిటీ వెస్ట్జోన్టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకుని, వారి వద్ద రూ.2.28 లక్షల విలువైన 310 మిల్లీ లీటర్ల చరాస్ఆయిల్, 70 గ్రాముల చరాస్, ఏపీ10 బీఈ 9797, ఎఫ్‌జెడ్ బైక్ 8 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం... గోల్కొండకు చెందిన సయ్యద్ముజాఫర్అలీ, అతని ఫ్రెండ్అబుబాకర్డ్రగ్స్కు బానిస అయ్యారు. ఈజీ మనీ కోసం ప్లాన్ చేశారు. వీరు ఫ్రెండ్మహ్మద్ఖాసీంతో అరకు వెళ్లి పాడేరులో రూ.80 వేలకు లీటర్హాష్ ఆయిల్ కొని తెచ్చారు. 5 ఎంఎల్బాటిల్స్ గా చేసి, ఒక్కోటి రూ.2 వేలకు అమ్ముతున్నారు.
వారి వద్ద కొనుగోలు చేసి జీషన్ నవీద్, సయ్యద్అన్వరుల్లా, హుస్సేని ఖాద్రి, సయ్యద్ముర్తజ్అలీ, పూనమ్‌కౌర్, నితిన్గౌడ్రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు 7 మందిని అరెస్ట్ చేసి ఫిలింనగర్పోలీసులకు అప్పగించారు. సిటీ కమిషనర్, డీసీపీ ఆదేశాల మేరకు టాస్క్ఫోర్స్వెస్ట్జోన్ టీం ఎండీ ఖలీల్ పాషా, ఇన్స్పెక్టర్ షేక్ కవియుద్దీన్ పర్యవేక్షణలో నిందితులను అరెస్ట్ చేశారు.