- గత బీఆర్ఎస్ సర్కార్ 2022-23లో పెట్టిన బడ్జెట్‌పై కాగ్
- కేటాయింపులు రూ.2.77 లక్షల కోట్లు ..ఖర్చు మాత్రం రూ.2.14 లక్షల కోట్లు
- దళితబంధు, డబుల్ ఇండ్లు, గొర్రెల పంపిణీకి పైసా ఇయ్యలే
- కాళేశ్వరం, మిషన్ భగీరథ కోసమే ఎక్కువ అప్పులు
- అప్పుల కిస్తీలు, వడ్డీల కింద పదేండ్లలో కట్టాల్సిన మొత్తమే రూ.2.67 లక్షల కోట్లు అని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ అధ్వానంగా చేసిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) పేర్కొంది. సరైన అంచనాలు లేకుండా 2022–23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని.. అందులో చెప్పిన మేరకు ఖర్చు చేయలేదని తెలిపింది. కేవలం బడ్జెట్‌ను ఎక్కువగా చూపేందుకు అంకెల గారడీ చేసిందని చెప్పింది.
ఎంత ఆదాయం వస్తుంది? ఎంత ఖర్చు చేయాలి? అనే దానిపై ఓ లెక్కాపత్రం లేకుండా.. బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసి, చివరకు ఖర్చు చేసింది కొంతేనని పేర్కొంది. 202-2–---23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.77 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టి, ఖర్చు చేసింది రూ.2.14 లక్షల కోట్లు మాత్రమేనని వెల్లడించింది. ఓవైపు బడ్జెట్లో కేటాయింపులు చేసి, ఖర్చు చేయలేదని.. మరోవైపు అసెంబ్లీ ఆమోదం లేకుండానే దాదాపు రూ. 9 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపింది. గత ప్రభుత్వ తీరుతో అప్పుల కిస్తీలు, వడ్డీలకు కలిపి పదేండ్లలో (2023–24 నుంచి 2032–33 వరకు) ఏకంగా రూ.2.67 లక్షల కోట్లు చెల్లించాల్సి ఉందని చెప్పింది.