పెద్ద కొడుకు..అన్నం పెడుతలేడు

  • సీఐకి కంప్లైంట్ చేసిన వృద్ధ దంపతులు

కొడిమ్యాల,వెలుగు: పెద్ద కొడుకు తమను పట్టించుకోవడం లేదని, అన్నం పెట్టకుండా రోజు తిడుతున్నాడని కొడిమ్యాల మండలం అప్పారావుపేటకు చెందిన వృద్ధ దంపతులు సోమవారం సీఐని ఆశ్రయించారు. గుడిపల్లి మాధవరెడ్డి(90), వీరవ్వ(80)కు మల్లారెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇద్దరు కుమారులు. మాధవ రెడ్డి తన ఆస్తిని గతంలోనే ఇద్దరు కుమారులకు పంచాడు. వయోభారం, అనారోగ్య సమస్యలతో దంపతులు సొంత పనులు కూడా చేసుకోలేకపోవడంతో ఇద్దరు కొడుకులు వంతుల వారీగా పోషించాలని పెద్దమనుషులు చెప్పారు. ఈక్రమంలో పెద్ద కొడుకు మల్లారెడ్డి వంతు వచ్చినప్పుడు తమకు అన్నం పెట్టడం లేదని, ఇష్టం వచ్చినట్లు తిడుతున్నడని, మానసిక వ్యధకు గురిచేస్తున్నడని సోమవారం సీఐ కోశ్వర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన ఇద్దరు కొడుకులను పిలిచి కౌన్సెలింగ్​ఇస్తానని చెప్పారు.