![ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని మోడీ](https://static.v6velugu.com/uploads/2022/02/The-election-campaign-in-Uttar-Pradesh-has-reached-its-peak-stage.The-BJP-is-rushing-to-hold-houses-meetings-and-rallies-in-a-row_t0XgTpwMAv.jpg)
ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం పీక్ స్టేజీకి చేరింది. బీజేపీ వరుసగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తూ దూసుకుపోతోంది.మోడీ మ్యానియాతో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు కమలనాథులు.అదే తరహాలో ప్రధాని మోడీ ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేడు యూపీ,మణిపూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు యూపీలో నాలుగో దశ ఎన్నికలు జరగనుండగా.. మణిపూర్ లో ఫిబ్రవరి 27న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. యూపీ, మణిపూర్ లో జరిగే ర్యాలీల్లో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
మరిన్ని వార్తల కోసం
భారత్‌లో భారీగా తగ్గిన కోవిడ్ కేసులు
సోనూసూద్‌కు పంజాబ్ పోలీసులు షాక్