కోడి, క్వార్టర్​ పంచినందుకు నోటీసులు

వరంగల్​ సిటీ, వెలుగు: టీఆర్ఎస్​ పార్టీ నేత రాజనాల శ్రీహరికి గురువారం ఎన్నికల కమిషన్​నోటీసులు జారీ చేసింది. కేసీఆర్​ జాతీయ స్థాయిలో రాణించాలని, బీఆర్ఎస్​పార్టీ విజయవంతం కావాలంటూ దసరా పండుగా రోజు వరంగల్​ తూర్పులోని హమాలీ కార్మికులకు శ్రీహరి క్వార్టర్​ బాటిల్​తోపాటు కోడిని పంపిణీ చేశాడు. ఇదంతా సోషల్ మీడియాలో వైరలైంది.

రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నిక ఉండడం, పంపిణీపై ఫిర్యాదులు రావడంతో స్పందించిన ఎలక్షన్​ కమిషన్​వరంగల్​ జిల్లా కలెక్టర్​ను వివరాలు కోరారు. ఎన్నికల కమిషన్​ జారీ చేసిన నోటీసును రాజనాల శ్రీహరికి వరంగల్​ జిల్లా కలెక్టర్​ అందజేశారు.