టీఆర్ఎస్ ఆవిర్భావం.. బీఆర్ఎస్ ఆర్భాటం.. రాబోయే ఎన్నికలే ఎజెండాగా మీటింగ్

  • ఏప్రిల్ 27 టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
  • గతేడాది పేరు మార్పు.. అక్టోబర్ లో ఆవిర్భావ్ పేరిట సమావేశం
  • జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడమే లక్ష్యంగా హడావుడి

నగరం గులాబీమయమైంది.. ఎటు చూసినా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్.. నిలువెత్తు కటౌట్లు దర్శనమిస్తున్నాయి. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఉత్సాహం గా కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ హాజరై పార్టీ జెండాను మీటింగ్ హాలులో ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. గత సమావేశాలకు భిన్నంగా మీడియాకు ఎంట్రీ లేకుండా ఈ మీటింగ్ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో అను సరించాల్సిన వ్యూహంపైనే కేసీఆర్ మాట్లడు తున్నారని సమాచారం.

కానీ ఇవాళ ఏప్రిల్ 27) తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించిన రోజు.. 2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. అలా ప్రారంభమైన టీఆర్ఎస్ గతేడాది( 5 అక్టోబర్ 2022న ) దసరా రోజున భారత్ రాష్ట్ర సమితి పేరు మా ర్చుకున్నది. ఆ రోజున తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం నిర్వ హించారు. ఈ సమావేశానికి అన్ని జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు, రాష్ట్రనాయకులు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తదితరుల సమక్షంలో కేసీఆర్ బీఆర్ఎస్ లోగోను, జెండాను ఆవిష్కరించా రు.

ఈ సందర్భంగా నేతలంతా బీఆర్ఎస్ - కండువాలు సైతం కప్పుకొన్నారు. తర్వాత ఈ ఏడాది జనవరి 18వ తేదీన బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను ఖమ్మంలో నిర్వహించారు. - ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే ప్రకటించారు. 5 కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని 5 చెప్పి ఢిల్లీ, పంజాబ్, కేరళ మఖ్యమంత్రులతో 5 పాటు ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్, సీపీఐ నేత - రాజా తదితరులను బీఆర్ఎస్ ఆహ్వానించింది.

అట్టహాసంగా తొలి సమావేశం నిర్వహించిన కేసీఆర్ బీజేపీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ౦ మాత్రమేనని తేల్చి చెప్పారు. ఇది ఆరంభం మా త్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. మిగతా పార్టీల 5 నాయకులూ గొంతు కలిపారు. వాస్తవానికి బీ - ఆర్ఎస్ గా పేరు మారింది గతేడాది అక్టోబర్ 5న.. కానీ టీఆర్ఎస్ ఆవిర్భావం రోజైన ఏప్రిల్ 3 27న సభ నిర్వహించడం ఏమిటన్న చర్చ 5 మొదలైంది.