రాష్ట్రంలో మైనింగ్ వ్యవహారాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. గ్రానైట్ వ్యాపారి పాలకుర్తి శ్రీధర్ ఆఫీస్ లో ఈడీ సోదాలు చేస్తోంది. పంజాగుట్టలోని శ్రీధర్ ఆఫీస్ కు ఉదయమే ఈడీ సిబ్బంది చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. అటు కరీంనగర్ లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. మంకమ్మతోటలోని శ్వేతా గ్రానైట్స్ ఆఫీస్, కమాన్ ఏరియాలోని అరవింద వ్యాస్ గ్రానైట్ ఆఫీస్ లో సోదాలు జరుగుతున్నాయి.
గ్రానైట్ రవాణా పన్ను ఎగవేసిన వ్యవహారంలో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ఈడీ తో పాటు ఐటీ అధికారులు కూడా సోదాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. కరీంనగర్ గ్రానైట్ అవకతవకలపై గతంలో సీబీఐ,ఈడీ కేసులు నమోదు చేశాయి.