వనపర్తి, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం మొదటి ర్యాండమైజేషన్ అనంతరం ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఈవీఎం, వీవీ ప్యాట్లను పోలీసు బందోబస్తు నడుమ చిట్యాలలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదామ్‌కు తరలించారు. కలెక్టర్ తేజస్‌నందలాల్ పవార్ ఆధ్వర్యంలో శనివారం
ఆర్డీవో ఆఫీస్ ఆవరణలోని ఈవీఎం గోదామ్ నుంచి ప్రజా ప్రతినిధుల సమక్షంలో క్లోజ్డ్ కంటైనర్ లో పోలీస్ భద్రతతో మార్కెట్ యార్డ్‌కు తరలించారు. అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ నగేశ్, తహసీల్దార్ యాదగిరి, వివిధ పార్టీల ప్రతినిధులు ప్రవీణ్, కుమారస్వామి, పరమేశ్వరాచారి, వేణాచారి, భరత్, శేఖర్, రహీమ్ ఉన్నారు.
ఈవీఎంల అప్పగింత
గద్వాల : మొదటి విడత ర్యాండమైజేషన్ పూర్తి అయిన తర్వాత ఈవీఎంలను ఆలంపూర్, గద్వాల రిటర్నింగ్ ఆఫీసర్లకు అందించినట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. శనివారం కలెక్టరేట్ లోని ఈవీఎం గోదామ్‌లో పొలిటికల్ పార్టీ లీడర్ల సమక్షంలో ఓపెన్ చేసి వాటిని పరిశీలించి కేటాయించారు. వాటిని ఆయా నియోజకవర్గాల గోదామ్‌లో భద్రపర్చినట్లు చెప్పారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్ చౌహాన్, వెంకటేశ్వర్లు, తహసీల్దార్ నరేశ్ ఉన్నారు.