![జేఈఈ అడ్వాన్డ్స్లో సీఓఈ స్టూడెంట్ల ప్రతిభ](https://static.v6velugu.com/uploads/2025/02/the-excellence-of-coe-center-of-excellence-students-in-bellampalli-town-in-the-jee-advanced-results_xuobVg9qLO.jpg)
బెల్లంపల్లి, వెలుగు : జేఈఈ అడ్వాన్డ్స్ఫలితాల్లో బెల్లంపల్లి పట్టణంలోని సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్) లో చదువుతున్న12 మంది విద్యార్థులు అర్హత సాధించారని ప్రిన్సిపాల్ దూట శ్రీధర్ తెలిపారు. స్టూడెంట్స్ షేక్ సుభాన్, కె.శ్రీని వాస్, ఎం.సాయిరాం, కె.షారోన్, డి.రాజేందర్, ఎస్.ఆదర్శ్, ఎస్.అభిలాష్, సీహెచ్.సాయికు మార్, ఎస్.వెంకటేశ్వర్, బి.అంజిబాబు, జి.చరణ్, ఐ.శ్రీహర్ష ప్రణయ్ కుమార్ అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఓఈలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ స్టూడెంట్లను ప్రిన్సిపాల్, టీచర్లు అభినందించారు.