ఎంతో చేశాం.. ఎన్నో చేశాం.. అయినా తప్పుడు వ్యక్తులుగా మారాం: మాల్యా, లలిత్ మోడీ X డిస్కషన్

ఎంతో చేశాం.. ఎన్నో చేశాం.. అయినా తప్పుడు వ్యక్తులుగా మారాం: మాల్యా, లలిత్ మోడీ X డిస్కషన్

ఐపీఎల్ టోర్నీ సృష్టికర్త లలిత్ కుమార్ మోదీ తన ప్రియ మిత్రుడు విజయ్ మాల్యాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. డిసెంబర్ 18న మాల్యా 69వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా.. లలిత్ కుమార్ మోదీ మాల్యాను ఉద్దేశించి.. ‘‘ నా ప్రియ మిత్రుడు మాల్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు.. జీవితంలో ఆటుపోట్లు సర్వ సాధారణం.. వాటిని మనిద్దరం చూశాం. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా అలాంటిదే. తరలిపోయేదే. బిగ్.. బిగ్ హగ్’’ అని మాల్యాకు లలిత్ కుమార్ మోదీ బర్త్ డే విషెస్ చెప్పాడు.

విజయ్ మాల్యా కూడా తన ప్రియ మిత్రుడు తెలిపిన శుభాకాంక్షలపై స్పందించాడు. ‘‘థ్యాంక్యూ మై డియర్ ఫ్రెండ్.. మనిద్దరం దేశానికి ఎంతో సేవ చేశాం.. అయినా సరే మనం దేశ ప్రజల దృష్టిలో తప్పు చేసిన వాళ్లలా మిగిలిపోయాం.. మనకు అన్యాయం జరిగింది..’’ అని లలిత్ కుమార్ మోదీకి విజయ్ మాల్యా రిప్లై ఇచ్చాడు. ఈ ఇద్దరి పలకరింపులు, ఒకరినొకరు ఓదార్చుకున్న పోస్ట్ చూసిన నెటిజన్లు ‘‘ఇద్దరికి ఇద్దరు సరిపోయారు.. సిగ్గు లేదు.. మానం.. అభిమానం లేదు’’ అని మండిపడుతున్నారు.

ALSO READ | Rahul Gandhi: రాహుల్ గాంధీపై బీజేపీ అటెంప్ట్ టు మర్డర్ కేసు!

బ్యాంకులను మోసం చేసి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల నుంచి రూ.17,750 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రికవరీ చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రకటించిన సంగతి తెలిసిందే. మన దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు దాదాపు 10 వేల కోట్ల రూపాయిల అప్పుల ఎగ్గొట్టి లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విదేశాలకు పారిపోయాడు.

ఆర్థిక నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటూ లలిత్ కుమార్ మోదీ కూడా దేశం విడిచి వెళ్లిపోయి విదేశాల్లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్‌కు చైర్మన్‌గా చేసిన లలిత్ మోదీ, రెండు ఐపీఎల్ జట్ల వేలానికి సంబంధించి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనేది ఆరోపణ. 2010 ఐపీఎల్ సీజన్ తర్వాత ఐపీఎల్ నుంచి లలిత్ మోదీని బహిష్కరించారు.