
హీరోయిన్ శృతి హాసన్ హాలీవుడ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చింది. సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ద్వారా ఇంటర్నేషనల్ సినిమాలో రంగ ప్రవేశం చేసింది. 5వ వెంచ్ ఫిలిం పెస్టివల్ (5th Wench Film Festival) లో ప్రదర్శించే రోజే ఇండియాలో కూడా ఈ మూవీ ప్రీమియర్ ఉంటుంది. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 2 వరకు ఫిలిం ఫెస్టివల్ ప్రదర్శన జరుగుతుంది.
డాఫ్నే షిమాన్ డైరెక్ట్ చేసిన ‘ది ఐ’ (The Eye) అనే మూవీలో లీడింగ్ లేడీ రోల్ లో శృతి నటించింది. ఈ బ్రిటిష్ మూవీ ద్వారా ఈ అమ్మడు ఇంటర్నేషనల్ డెబ్యూ ఇచ్చినట్లు కన్ఫామ్ అయ్యింది. మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు.
శృతిహాసన్ ఈ మూవీలో దియాన పాత్రలో నటించింది. ఒక ఐలాండ్ లో తన కళ్లముందే చిక్కుకుపోయిన.. మునిగిపోయిన తన భర్త ఫెలిక్స్ కోసం ఒక యంగ్ గాళ్ చేసే ఒక జర్నీ.. ఆమెను వెంటాడుతున్న కథాశం గురించి.. ఆ తర్వాత జరిగిన సంఘటనల సమాహారమే ఈ థ్రిల్లర్.
తన భర్తను తిరిగి తీసుకువచ్చేందుకు ఒక పురాతన పద్ధతిలో చేసే ఒక ఆచారం చేయాల్సి ఉంటుంది. అయితే దాని కోసం ఒక ఘోరమైన త్యాగం చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత శృతిహాసన్ ను వెంటాడిన పరిస్థితులు ఏంటనేవి చాలా థ్రిల్లింగ్ గా.. భయానకంగా ఉంటాయని మూవీ టీమ్ చెబుతోంది.