హైదరాబాద్, వెలుగు: మరుగునపడ్డ తెలంగాణ ప్రాంత చరిత్రను ‘ది ఫాలెన్ కింగ్డమ్ నిజాం’ బుక్ వెలికి తీసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా విశ్వేశ్వరయ్య భవన్లో ప్రముఖ కాలమిస్ట్, రైటర్ భాస్కర యోగి రచించిన ‘ది ఫాలెన్ కింగ్డమ్ నిజాం’ బుక్ రిలీజ్ కార్యక్రమం జరిగింది. దీనికి కిషన్ రెడ్డి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హాజరై, బుక్ ను ఆవిష్కరించారు.
Also Rard: సిరాజ్ బౌలింగ్ మెచ్చిన బాలీవుడ్ బ్యూటీ.. "ఇపుడేం చేయాలంటూ"..
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..బుక్కులో కాకతీయుల నుంచి ఏడవ నిజాం వరకు జరిగిన చరిత్ర ఉందని తెలిపారు. భావితరాలకు అర్థమయ్యే విధంగా పరిశోధనాత్మకంగా రచించారని చెప్పారు. తెలంగాణ విమోచనకు సంబంధించి జరుగుతున్న అనేక అసత్య కథనాలకు ఈ బుక్ చెక్ పెడుతుందని వక్తలు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈటల రాజేందర్, ఎన్ హెచ్ సీఈవో సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.