యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ నేడు విడుదలైంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ కొన్నేండ్లుగా ఎదరుచూస్తున్నారు. బెనిఫిట్ షోలతోనే ఈ చిత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. అయితే విడుదల రోజే ‘ఆర్ఆర్ఆర్’ షో నడుస్తున్న థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. అనంతపురం పట్టణంలోని ఎస్వీ మాక్స్ థియేటర్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా బెనిఫిట్ షో చూస్తూ.. ఓబులేసు (30) అనే అభిమాని గుండెపోటుకు గురై.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన స్నేహితులు వెంటనే సవేరా ఆస్పత్రికి తరలించారు. ఓబులేసును పరిశీలించిన వైద్యులు.. అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఓబులేసు మరణంతో అతని స్నేహితులు, కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సినిమా విడుదల సందర్భంగా రాత్రంతా హడావిడి చేసిన తమ స్నేహితుడు.. ప్రాణాలతో లేడనే విషయం తమను ఎంతగానో బాధిస్తోందని ఓబులేసు ఫ్రెండ్స్ ఆవేదన వ్యక్తం చేశారు.
For More News..
పీయూష్ గోయల్‌కు ఎర్రబెల్లి సవాల్
ఏప్రిల్ 14 నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 2