ఆదివారం(జనవరి 14) ఇండోర్ వేదికగా జరిగిన భారత్ - అఫ్ఘనిస్థాన్ రెండో టీ20లో ఓ అభిమాని అత్యుత్సాహం చూపిన విషయం తెలిసిందే. అఫ్ఘనిస్థాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. ఓ అభిమాని భద్రతా సిబ్బంది కళ్లు గప్పి మైదానంలోకి చొరబడ్డాడు.
బారికేడ్లను దాటుకుని మరీ మైదానంలోకి ప్రవేశించిన అభిమాని.. నేరుగా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్ళాడు. కోహ్లీ పాదాలను నమస్కరించిన అనంతరం అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. ఆ సమయంలో కోహ్లీ అతన్ని భుజం తట్టి పైకి లేపాడు. అంతలోనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై సదరు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా రెండ్రోజుల క్రితం జరిగినది.
A fan touched Virat Kohli's feet and hugged him. He told to security to be gentle with fan.
— CricketMAN2 (@ImTanujSingh) January 15, 2024
- King Kohli is everyone's favourite, The Global Icon! ? pic.twitter.com/38F5zwHLYK
ఈ ఘటన అనంతరం సదరు అభిమానికి తన ఊరిలో ఘన స్వాగతం లభించింది. పరుగుల రారాజు విరాట్ కోహ్లీని కలిసినందుకు గాను అతని స్నేహిహితులు.. సదరు యువకుడికి సన్మానం చేశారు. శాలువా కప్పి.. మెడలో దండేసి నువ్ మగాడివిరా బుజ్జి అంటూ అతన్ని పొగడ్తలతో ముంచెత్తారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The guy who hugged Virat Kohli in Indore is getting felicitated by his friends.pic.twitter.com/GiHSvrdLcE
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 16, 2024