కరెంట్ షాక్ కొట్టి రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధన్నపేట మండలం కడారిగూడెనికి చెందిన శిరంశెట్టి రవీందర్(50) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ లాగే పొలానికి వెళ్లాడు. పనులు చేస్తుండగా పక్కనే ఉన్న ట్రాన్స్ ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. గమనించిన కర్షకుడు చేతికి టవల్ చుట్టుకుని ట్రాన్స్ ఫార్మర్ ని ఆపాలని ప్రయత్నించాడు.
ఈ క్రమంలో వైర్ అతని చేతికి తగలడంతో షాక్ కొట్టింది. దీంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆయన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.