అటవీశాఖ అధికారులు పంట తొలగించారని..

అటవీశాఖ అధికారులు పంట తొలగించారని..

రాజన్న సిరిసిల్ల జిల్లా: అటవీ శాఖ అధికారులు పంట తొలగించారని ఆరోపిస్తూ  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు.  వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామంలో జరిగిందీ ఘటన. పురుగుల మందు తాగిన రమేశ్ ను ఎల్లారెడ్డిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా గడ్డి మందు కొట్టి తమ పంట నాశనం చేశారని రమేష్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 
అటవీ శాఖ పరిధిలోని భూమిలో వేసిన పంట తొలగించాలని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో పత్తి పంటపై గడ్డి మందు చల్లామని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే భూమిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయిందని వారు పేర్కొన్నారు.