పాలపై ఇన్సెంటివ్ ఇంకెప్పుడిస్తరు : పాడిరైతులు

హుస్నాబాద్​, వెలుగు : ప్రభుత్వం పాలపై ఇచ్చే ఇన్సెంటివ్ ‌‌ డబ్బులు నాలుగేండ్లుగా ఇవ్వడం లేదని పాడిరైతులు మండిపడ్డారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ‌‌లో ఆందోళనకు దిగారు.  కరీంనగర్​ రోడ్డులోని పాలకేంద్రం నుంచి అంబేద్కర్​ చౌరస్తా వరకు ర్యాలీ తీసి.. అక్కడే రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పాడి రైతులను ప్రోత్సహించడానికి లీటరు పాలపై రూ.4 ఇన్సెంటివ్ ఇస్తామని 2014లో ప్రకటించిన సీఎం కేసీఆర్ ‌‌ ‌‌ రెండేండ్ల వరకు  మాత్రమే  ప్రోత్సాహాన్ని అందించారన్నారు.  

Also Read :- IND vs AUS: శభాష్ అనిపించుకున్న రాహుల్.. 27 ఏళ్ల చరిత్రలో తొలి విజయం

2016 నుంచి తమ ఖాతాల్లోకి ఇన్సెంటివ్స్ జమ కాలేదన్నారు.  ఆందోళన చేస్తే2020  వరకు కొంతమందికి ఇచ్చి.. మిగతా వారికి ఇవ్వలేదన్నారు.  ప్రస్తుతం పశువుల దాణా ఖర్చులు విపరీతంగా పెరగడంతో నష్టపోతున్నామని వాపోయారు.  ఇన్సెంటివ్​ను రూ.4 నుంచి రూ.7కు పెంచి పాల బిల్లుతో కలిసి చెల్లించాలని డిమాండ్ చేశారు.