వయనాడ్: కాంగ్రెస్ జనరల్ ప్రియాంక గాంధీ భవితవ్యం నేడే తేలనుంది. కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. యూడీఎఫ్ అభ్యర్థి గా మొదటిసారిగా ఆమె ఎన్నికల బరిలోకి దిగడంతో అందరి దృష్టి దీనిపై పడింది. శనివారం ఇక్కడ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉదయం 8 కి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ముందుగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తామని అధికారులు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్ బరేలీ.. రెండు చోట్ల నుంచి గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో ఈ నెల 13న ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది.