ఫోన్ మాట్లాడుతుందని బిడ్డని మేడపై నుంచి తోసేసిన తండ్రి

ఫోన్ మాట్లాడుతుందని బిడ్డని  మేడపై నుంచి తోసేసిన తండ్రి

కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కూతురు పట్ల ఓ తండ్రి కర్కషత్వంగా ప్రవర్తించాడు. కన్నకూతురిని మేడపై నుండి తోసివేశాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో చోటుచేసుకుంది. కూతురు ఫోన్ మాట్లాడుతుందన్న ఆగ్రహంతో తండ్రి ఈ దారుణానికి పాల్పడ్డట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదుతో పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.