
ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి యాపిల్ ఫోన్‌కు లేదా యాపిల్ నుంచి ఆండ్రాయిడ్‌కు మారినప్పుడు అప్పటివరకు చేసిన వాట్సాప్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం కష్టం. కొత్త ఓఎస్‌కు మారినప్పుడు అప్పటివరకు చేసిన వాట్సాప్ చాట్ మొత్తం పోతుంది. లేదంటే థర్డ్‌పార్టీ యాప్స్ వాడటమో, క్లౌడ్ యాప్‌లో స్టోర్ చేసుకుని డౌన్‌లోడ్ చేసుకోవడమో చేయాలి. అయితే ఈ ఇబ్బంది లేకుండా డైరెక్ట్‌గా వాట్సాప్ చాట్ హిస్టరీ ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ స్టార్ట్ అయితే కొత్త ఫోన్‌కు మారినప్పుడు వాట్సాప్ హిస్టరీని ఈజీగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌తో ప్రొఫైల్ ఫొటో, పేరు, ఇండివిడ్యువల్ చాట్స్, గ్రూప్ చాట్స్, సెట్టింగ్స్ అన్నీ పాత ఫోన్‌లో ఎలా ఉన్నాయో, కొత్త ఫోన్‌లో కూడా అలాగే ఉంటాయి. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్ ఎప్పుడు లాంచ్ అవుతుందో ఇంకా కంపెనీ చెప్పలేదు.