బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీక : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

బక్రీద్ పండుగ అంటేనే త్యాగాలకు ప్రతీకని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.  రాష్ట్ర ముస్లిం సోదర, సోదరీమణులకు  బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.   నల్గొండ పట్టణం మునుగోడు రోడ్డు లో ఉన్న ఈద్గా లో బక్రీద్ సందర్బంగా ప్రత్యేక ప్రార్థనల్లో  మంత్రి, జిల్లా ఎస్పీ, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  నల్గొండ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నారని చెప్పారు.   

పేద ముస్లింలకు ఇండ్లు  కట్టిస్తామని వెల్లడించారు.  జనాభా పెరుగుతున్న సందర్భంగా ఈద్గాను అభివృద్ధి చేస్తామన్నారు.   ముస్లింలకు విద్యారంగంలో ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించి ముందుకు తీసుకెళ్తామన్నారు.   ఔట్సోర్సింగ్ ఉద్యోగాలలో చదువుకున్న ముస్లిం యువతీ యువకులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అందరూ బాగుండాలని అల్లాను ప్రార్థిస్తున్నట్టు చెప్పారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.