Champions Trophy 2025: 5 వికెట్లు, 41 పరుగులు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు నోచుకోని ఒమర్జాయ్

Champions Trophy 2025: 5 వికెట్లు, 41 పరుగులు.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కు నోచుకోని ఒమర్జాయ్

ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ బ్యాడ్ లక్ ఎవరికీ రాకూడదు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 26) ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టాడు. మొదట బ్యాటింగ్ లో అప్పటివరకు నిదానంగా ఉన్న జట్టు స్కోర్ ను ఒక్కసారిగా వేగం పెంచాడు. 31 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. ఈ ఆఫ్గన్ ఆల్ రౌండర్ ఇన్నింగ్స్ లో ఒక ఫోర్, 3 సిక్సర్లు ఉన్నాయి. ఆ తర్వాత బౌలింగ్ లో అద్భుతంగా రాణించాడు. 

స్పెషలిస్ట్ బౌలర్లు విఫలమైన వేళ ఏకంగా 5 వికెట్లతో చెలరేగాడు. 4 ఓవర్ లోనే పిల్ సాల్ట్ ను బౌల్డ్ చేసి తన జట్టుకు శుభారంభం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రమాదకరంగా మారుతున్న రూట్, బట్లర్ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఇదే ఊపులో రూట్ వికెట్ తీసి ఆఫ్గన్ జట్టుకు విజయాన్ని దగ్గర చేశాడు. చివర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆర్చర్, ఆదిల్ రషీద్ వికెట్లను తీసి ఆఫ్ఘనిస్తాన్ విజయాన్ని ఖాయం చేశాడు. ఒక జట్టుకు ఇంత చేసినా ఓమార్జాయ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కకపోవడం అతని దురదృష్టం. 

ALSO READ : Pakistan Cricket: రిటైర్ అవ్వను.. మూడు వారాల్లో మళ్లీ తిరిగొస్తా..: పాకిస్తాన్ ఓపెనర్

ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో అద్భుతంగా రాణించిన ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 106 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న ఈ ఆఫ్ఘన్ ఓపెనర్.. ఓవరాల్ గా 146 బంతుల్లో 177 పరుగులు చేసి చివరి ఓవర్లో ఔటయ్యాడు. జద్రాన్ ఇన్నింగ్స్ లో 12 ఫోర్లతో పాటు 6 సిక్సర్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ మొత్తం స్కోర్ లో సగానికి పైగా పరుగులు ఇబ్రహీం బ్యాట్ నుంచే రావడం విశేషం. చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ 8 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మరోవైపు వరుసగా రెండు ఓటములతో ఇంగ్లాండ్ సెమీస్ రేస్ నుంచి నిష్క్రమించింది.