దేవరకొండ (కొండమల్లేపల్లి), వెలుగు : షార్ట్ సర్క్యూట్ తో కట్టెల మిషన్ దగ్ధమైన సంఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో జరిగింది. బాధితుడు పసునూరి జగదీశ్వరాచారి వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున కట్టెల మిషన్లో మంటలు చెలరేగాయి.
స్థానికులు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా, వారు ఘటనాస్థలానికి చేరుకొని ఫైర్ఇంజన్ల సహాయంతో మంటలు ఆర్పారు. షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపారు.