హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో పాత నేరస్థుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా.. దుండగుడు పోలీసులపై కాల్పులు జరిపాడు. నిందితుడు రెండు రౌండ్లు ఫైరింగ్ చేయడంతో ఓ కానిస్టేబుల్, బౌన్సర్‌కు గాయాలు అయ్యాయి. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు చివరకు దొంగను అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో శనివారం (ఫిబ్రవరి 1) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
నిందితుడి కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్, బౌన్సర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. పబ్‌లో ఒక్కసారిగా ఫైరింగ్ జరగడంతో అక్కడికి వచ్చిన వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. గచ్చిబౌలిలో కాల్పుల ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు ఆరా తీశారు. పోలీసుల ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
ALSO READ | రాజేంద్రనగర్ లో ఫుట్ పాత్ ఆక్రమణలు తొలగింపు
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వారం రోజుల క్రితం కూడా హైదరాబాద్లో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. బీదర్‌లో ఏటీఏం చోరీ చేసిన ముఠా ఆఫ్జల్ గంజ్‌కు రాగా.. పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయారు. ఓ పక్క ఈ ఘటనపై విచారణ జరుగుతుండగానే.. తాజాగా హైదరాబాద్లో మరోసారి కాల్పులు జరగడం గమనార్హం.