Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమరం.. దుబాయ్‌కు బయలుదేరిన రోహిత్, కోహ్లీ

Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ సమరం.. దుబాయ్‌కు బయలుదేరిన రోహిత్, కోహ్లీ

2025 ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. మరో నాలుగు రోజుల్లో ఈ టోర్నీ గ్రాండ్ గా ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని మెన్ ఇన్ బ్లూ జట్టు టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. చివరిసారిగా 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టు మరోసారి అదే సీన్ రిపీట్ చేయాలనీ భావిస్తుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.

ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ కోసం భారత జట్టు తొలి బ్యాచ్ దుబాయ్ కు బయలుదేరారు. తొలి బ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం రోహిత్ శర్మ దుబాయ్ కు బయలుదేరుతూ  విమానాశ్రయంలో కనిపించిన ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు కేఎల్ రాహుల్, అర్షదీప్ సింగ్, వాషింగ్ టన్ సుందర్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి ఈ బ్యాచ్ లో ఉన్నారు. ఆదివారం (ఫిబ్రవరి 16) రెండో బ్యాచ్ దుబాయ్ కు బయలు దేరే అవకాశం కనిపిస్తుంది.

Also Read : ఐదుగురు స్పిన్నర్లు ఎందుకు

మొత్తం 15 మంది స్క్వాడ్ తో కూడిన భారత జట్టు అన్ని జట్ల కంటే  బలంగా కనిపిస్తుంది. భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ గ్రూప్ ఏ లో ఉండగా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉన్నాయి. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో  ఫిబ్రవరి 23 న మ్యాచ్ జరుగుతుంది. పాకిస్తాన్‌,దుబాయ్ వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి ఎనిమిది జట్లు ఆడే ఈ టోర్నమెంట్‌లో మొత్తం 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత జట్టు పాల్గొనే మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి.